21-10-2025 05:41:54 PM
కామారెడ్డి (విజయక్రాంతి): దీపావళి పండుగ రోజు దక్షిణాఫ్రికాలో కామారెడ్డి జిల్లా బిక్కనూరుకు చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికాలో బోరింగ్ డ్రిల్లర్, డ్రైవర్ గా పనిచేస్తున్న బత్తుల శ్రీనివాసు(32) సోమవారం ఇంటి సమీపంలో చెట్టుకు వేలాడుతూ విగత జీవిగా ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేశారా అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతి చెందిన శ్రీనివాస్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు షబ్బీర్ అలిని కోరారు. ప్రభుత్వ సహాయం అందించి శ్రీనివాసు మృతదేహాన్ని తెప్పించే విధంగా కృషి చేస్తానని షబ్బీర్ అలీ హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.