calender_icon.png 21 October, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

21-10-2025 05:36:53 PM

సీపీ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల, (విజయక్రాంతి): విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే)ను పురష్కరించుకొని మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడారు. 

ప్రజల సేవకోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహనుభావులని, వారు చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాలని, ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నితీ, నీజాయితీతో పనిచేయాల్సి వుంటుందన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు ఎల్లప్పుడు మన గుండెల్లోనే వుంటారని, వారు మన మధ్య లేనకున్నా మనం వారిని స్మరిస్తునే వుంటామని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన భాధ్యత మనందరిపై వుందని, వారికి ఎలాంటి సమస్య వున్న వారికి పోలీస్ విభాగం తరుపున పూర్తి సహకారం అందించాలన్నారు. 

అనంతరం గత ఏడాది నుంచి ఇప్పటి వరకు దేశంలో విధి నిర్వహణలో మరణించిన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ చదివి వినిపించారు. ఆర్.ఐ మల్లేశం సారధ్యంలో సాయుధ పోలీసులు శోక్ శ్రస్త్ చేయగా, మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఏసిపిలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్ ఐ లు, ఆర్ ఎస్ ఐ లు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, పెద్దపల్లి డిసిపి కరుణాకర్, ఆర్ జి - వన్ జిఎం లలిత్ కుమార్, గోదావరిఖని ఏసిపి ఎం రమేష్, మంచిర్యాల ఏసిపి ఆర్ ప్రకాష్, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్, ఈవో శ్రీనివాస్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఏన్టీపీసీ , ఆర్ఎఫ్ సిఎల్ అధికారులు, సిపిఓ సిబ్బంది, స్పెషల్ పార్టీ, ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.