calender_icon.png 21 October, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేర్గు సుగుణమ్మ గుండెపోటుతో మృతి

21-10-2025 05:45:15 PM

నేత్రదానంకు అంగీకారం తెలిపిన కుటుంబ సభ్యులు..

అభినందనలు తెలిపిన పట్టణ ప్రముఖులు, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ నివాసి మేర్గు సుగుణమ్మ గుండపోటుతో సోమవారం రాత్రి మృతిచెందగా బాధలో ఉండి కూడా, నేత్రాలను దానం చేస్తే, ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించవచ్చని కుమారుడు మెరుగు శ్రీనివాస్, మెరుగు  యాదగిరి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. పుట్టెడు దుఃఖంలో కూడా స్పందించి నేత్రాలను దానం చేయడానికి అంగీకరించగా సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ మేరుగు భీష్మాచారి ఆధ్వర్యంలో మృతురాలి నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ గాజుల సతీష్ సహకారంతో సేకరించి మంగళవారం హైదరాబాదుకు తరలించడం జరిగింది.

ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన కుమారుడు కోడలు మేర్గు మాధవి శ్రీనివాస్, జ్యోతి యాదగిరి, కూతుర్లు అల్లుండ్లకు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సాయిరీ మహేందర్, గాంధీనగర్ మాజీ కౌన్సిలర్ అనుమాల అరుణ బాబూరావు, బిజెపి జిల్లా నాయకులు సామాజిక వేత్త మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, మాజీ వార్డు సభ్యులు ఆమీర్ శెట్టి తిరుపతి, గాంధీనగర్ యువత పాల్గొని నేత్ర దాతకు నివాళులు అర్పించి కుటుంబానికి అభినందనలు ధన్యవాదాలు తెలిపారు. విషాదంలోను ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించడానికి నేత్రాలను దానం చేయడానికి అంగీకారం తెలిపిన కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి ముఖ్య సలహాదారులు నూక రమేష్, కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి కే.ఎస్ వాసు, జిల్లా గౌరవ అధ్యక్షులు లగిశెట్టి చంద్రమౌళి అభినందనలు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.