21-10-2025 05:34:24 PM
నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని గట్లమల్యాల గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ద్యాగాల పెద్ద వెంకటయ్య(72) అనారోగ్యంతో మృతి చెందాడు. వెంకటయ్యకు కొడుకులు లేరు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సంప్రదాయం ప్రకారం తండ్రి అంత్యక్రియలను, తలకొరివిని కొడుకు మాత్రమే పెట్టాలనే ఆచారం ఉంది. తండ్రికి పుత్ర స్థానంలో నిలబడిన కూతుర్లు అంతిమ సమస్కారాల్లో చితికి నిప్పంటించి, తలకొరివి పెట్టారు. తండ్రి పట్ల కూతుళ్లు చూపిన ఈ ప్రేమానురాగాలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. అంత్యక్రియల నిమిత్తం పలువురు గ్రామస్తులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.