21-10-2025 05:39:10 PM
ఉప్పల్ (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో అంబర్పేట్ లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి మల్లాపూర్ యువత కదిలి వెళ్లారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు భావితరలకు స్ఫూర్తిగా రక్తదానం చేస్తున్నట్లు యువత పేర్కొన్నారు. మల్లాపూర్ రంగు శ్రవణ్ గౌడ్ ప్రోత్సాహంతో దాదాపు యొక్క 21 మంది చేత రక్తదానం చేయించారు. మల్లాపూర్ చెందిన అరుణ్ యాదవ్ ప్రోత్సాహంతో కూడా కొంతమంది యువత రక్తదానాన్ని చేశారు. సందర్భంగా యువత మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రత స్థాపన కోసం అసాంఘిక శక్తులతో పోరాడుతూ ప్రాణ త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్తీక్ చిన్న గౌడ్ యువత పాల్గొన్నారు.