21-10-2025 05:47:47 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలో సోమవారం రాత్రి సదర్ ఉత్సవం వైభవంగా జరిగింది. ఘట్ కేసర్ యాదవ సంఘం అధ్యక్షుడు రాజబోయిన యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సదర్ ఉత్సవంలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మామిండ్ల ముత్యాల్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాలో యాదవులకు సంబంధించిన పాటలతో హోరెత్తించారు. దీపావళి పండుగ సందర్బంగా యాదవులు కుల పండుగగా భావించే సదర్ యాదవ సంఘం నాయకులతో కలిసి యాదవుల కుల దైవం అయిన శ్రీకృష్ణ భగవానుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం దున్నపోతుల విద్యాసాలు ప్రదర్శించారు. ముఖ్య అతిథులు ఘట్ కేసర్ మున్సిపాలిటీ యాదవులకు సదర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. యాదవ సోదరులు సదరు పండుగ విన్యాసాల కోసం వారి అత్యుత్తమ మగ గేదెలను ప్రదర్శించడానికి ప్రతి కుటుంబం ఈఅవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. గేదెలను నూనెతో మెరుస్తూ, వాటి కొమ్ములు, శరీరానికి రంగులు వేయడం, మెడ చుట్టూ దండలు, వాటి పాదాలకు చీలమండలు (గజ్జలు), మెడ లేదా నుదుటిపై గంటలతో సీ-షెల్ బ్యాండ్లు, వాటి కొమ్ములపై నెమలి ఈకలతో అలంకరించబడి ఉంటాయి అలా వాటిని చూడటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈకార్యక్రమంలో ఘట్ కేసర్ పట్టణ యాదవ సంఘం సభ్యులు, యాదవులు, పట్టణ ప్రజలు, నాయకులు తదితరులు పెద్దయెత్తున పాల్గొన్నారు.