21-10-2025 05:52:33 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని లక్ష్మణ చందా కేజీబీవీ పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులతో విద్యాబోధనపై అడిగి తెలుసుకున్నారు. వంటకాలను పరిశీలించారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు ప్రతిరోజు అందించాలని ఎస్ఓకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ నవనీత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.