calender_icon.png 5 November, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆస్పత్రిలో 4.5 కోట్లు స్వాహా

05-11-2025 12:00:00 AM

-బిల్లులు, రసీదులు పెట్టకుండా నిధుల దుర్వినియోగం

-సూపరింటెండెంట్, డాక్టర్ల పాత్ర!

-కరీంనగర్ ఆస్పత్రిలో వెలుగులోకి

-అవినీతి జరిగిందని జిల్లా ఆధికారులకు తెలిసినా చర్యలు తీసుకోలేదు?

కరీంనగర్, నవంబర్ 4 (విజయక్రాంతి): కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్‌లో టీఎస్ ఎంఎస్‌ఐడిసి, నిధులు, హెచ్‌డీఎస్, టీవీవీపి, కాయకల్ప నిధుల్లో రూ.4.5 కోట్ల రూపాయలకు ఎలాంటి బిల్లులు, రసీదులు పెట్టకుండా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. హాస్పి టల్ నిర్వహణకు ఉపయోగించే వాహనాలకు డీజిల్, పెట్రోల్ వినియోగంలో కూడా అవినీతి జరిగినట్లు తెలుస్తున్నది.

2021 వరకు జరిగిన అవినీతిపై విచారణ 

కరీంనగర్ జిల్లా హాస్పిటల్‌లో 2021 నుంచి 2024 వరకు జరిగిన అవినీతి, అక్రమాలపై అప్పటి జిల్లా వైద్యాధికారిని లలిత దేవి జరిపిన విచారణ నివేదిక  ప్రకారం అప్పటి సూపరింటెండెంట్ కృష్ణప్రసాద్, ఇతర డాక్టర్ల పాత్ర ఉన్నట్టు స్పష్టమయింది. రూ.4.50 కోట్లకు ఎలాంటి బిల్లులు, రసీదులు ఓచర్సు లేనట్టు తేలింది. జనరల్ హాస్పిటల్ ఐసీఐసీఐ, ఐవోబీ, యూనియన్ బ్యాంకు యొక్క 2021 నుంచి 2024 వరకు సమగ్రంగా ఆడిట్ చేస్తే దొంగల బాగోతం బయటపడనుంది. అవినీతి జరిగిందన్న విష యం జిల్లా ఆధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ కుంభకోణంపై తెలంగాణ ఆరోగ్యశాఖ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రజాధనాన్ని కాపాడవలసిన అవసరం ఉంది.

కలెక్టర్‌కు ఫిర్యాదు

రూ.4.50 కోట్ల అవినీతికి పాల్పడ్డ ప్రభు త్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణప్రసాద్, ఇతర డాక్టర్లను సస్పెం డ్ చేయాలంటూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి పిర్యాదు చేశారు. కృష్ణప్రసాద్ నుంచి 4.50 కోట్లు రికవరీ చేయాలని కోరారు. అప్పటి హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్లపై వచ్చిన ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అవినీతిపై తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తామన్నారు.