22-01-2026 03:49:13 PM
గోండి భాషలో మాట్లాడిన కలెక్టర్ హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): సందీర్ కీ రామ్ రామ్ ఆదివాసీలను ఆప్యాయంగా జిల్లా కలెక్టర్ కె. హరిత పలకరించారు. గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా పర్యటనలో భాగంగా జైనూరు మండలం జామ్ గాంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ గోండి భాషలో మాట్లాడడంతో అక్కడున్న ఆదివాసీలు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతం భావోద్వేగంతో ముడిపడి ఉందని తెలిపారు. కుమ్రంభీం జిల్లాకు కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందన్నారు.200 శాతం జిల్లాలోని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.