calender_icon.png 27 January, 2026 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎస్‌ఆర్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

27-01-2026 12:00:00 AM

భద్రాచలం, జనవరి 26 (విజయక్రాంతి): వివిధ కార్పొరేట్ సంస్థలతో ఆదివాసి గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు మంగళవారం  నిర్వహించే సి ఎస్ ఆర్ సమ్మిట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.  సోమవారం  సాయంత్రం ఐటిడిఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో సిఎస్‌ఆర్ సమ్మిట్ కి సంబంధించిన ఏర్పాట్లను ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ , సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్టతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద గిరిజన గిరిజన కుటుంబాలకు 15 పేరెన్నిక గన్న కార్పొరేట్ సంస్థలు స్వల్ప కాలిక ప్రయోజనాలకే కాకుండా గిరిజన గ్రామాలలో స్థిరమైన ఆర్థికపరమైన వసతులు కల్పించడానికి సిఎస్ఆర్ ప్రతినిధులు, పాలసీ మేకర్స్ డెవలప్మెంట్ పార్ట్నర్స్ అందరూ ఈ సమ్మిట్ లో పాలుపంచుకుంటు న్నందున వారిని సాదరంగా ఆహ్వానించి మనకు కావలసిన మౌలిక వసతులు కల్పించుకోవాలని అన్నారు. ప్రస్తుతం సిఎస్‌ఆర్ సమ్మేట్ బృందం ప్రతినిధులు భద్రాచలంలోని బీసీ హాస్టల్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారని ఆయన అన్నారు. 

బయో చారు తయారు చేసే గోళాన్ని పరిశీలించారు. సంబంధిత అధికారులు వారికి అప్పగించిన పనులను సక్రమంగా పద్ధతి ప్రకారము విధులు నిర్వహించి సి ఎస్ ఆర్ సమ్మిట్ విజయవంతం అవ్వడానికి కృషి చేయాలన్నారు.   ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిఆర్డిఓ విద్యాచందన, సిపిఓ సంజీవరావు, తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, ఆర్ ఐ కీర్తి, గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్, జేడీఎం హరికృష్ణ, డిఆర్డిఏ ఏపీఎం ప్రసాద్ ఇతర శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.