27-01-2026 12:00:00 AM
గరిడేపల్లి, జనవరి 26 : రక్తదానం చేసి ప్రతి ఒక్కరూ ప్రాణదాతలుగా మారాలని గరిడేపల్లి గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య అన్నారు. మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం గరిడేపల్లి యూత్ ఆధ్వర్యంలో తల సేమియా స్కిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్త శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. అన్ని దానాలుకెల్లా రక్తదానం చాలా గొప్పదని తల సేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
తదుపరి 80 బ్లడ్ బ్యాగ్స్ సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ పైడిమర్రి రంగనాదు, గ్రామ శాఖ అధ్యక్షులు పిట్ట సైదులు, పెండెం ధనయ్య గౌడ్, పరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ కేతపల్లి నరసయ్య,యూత్ సభ్యులు నకరికంటి సతీష్, హరీష్, కొత్తపల్లి రవి, శేఖర్, నకిరకంటి రవి, మాచర్ల రవి, వేణు పాల్గొన్నారు.