27-01-2026 04:21:56 PM
STUTS నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎస్ .భూమన్న యాదవ్
భైంసా,(విజయక్రాంతి): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఉపాధ్యాయ వ్యతిరేక నూతన విద్యా విధానం (NEP)ను తక్షణమే సమీక్షించాలని, కోరుతూ వచ్చే నెల 5న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం ఎస్టియుటిఎస్ జిల్లా అధ్యక్షులు భూమున యాదవ్ పిలుపునిచ్చారు.
మంగళవారం తానూర్ మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించి చలో ఢిల్లీ ప్రాధన్యతలు ఉపాధ్యాయులకు వివరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సిపిఎస్ (నూతన పెన్షన్ విధానం)ను పూర్తిగా రద్దు చేసి ఓపిఎస్ (పాత పెన్షన్ విధానం)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ STUTS (AISTF) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఉపాధ్యాయ సమస్యలు ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం ఈ పోరాటం తప్పనిసరి. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేలా ఉపాధ్యాయులంతా ఢిల్లీ బాట పట్టి చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని చరిత్రాత్మకంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.