calender_icon.png 27 January, 2026 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిలాఫలకాలు మార్చి కొత్త శంకుస్థాపనలు

27-01-2026 04:30:21 PM

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిట్యాల,(విజయక్రాంతి): ఎన్నికల సమయంలో శిలాఫలకాలు మార్చి కొత్త శిలాఫలకాలు పెట్టి కొత్త శంకుస్థాపనలతో ప్రజలను మాయ చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య  విమర్శించారు. మంగళవారం నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు శివనేనిగూడెంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. కేసీఆర్ హయంలో శివనేనిగూడెంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరుగుతూ క్లుప్తంగా వివరించారు.

అబద్ధాలతో, మాయమాటలతో కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చిదని,  ప్రజలను మోసగించిందని, రెండేళ్ల నుండి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, ప్రజలకు బాకీ పడిన వివరాలను ఆయన వార్డులో తిరుగుతూ ప్రజలకు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివనేనిగూడెంలో కేసిఆర్ హయంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించామని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దాదాపు 2 కోట్ల పై చిలుకు నిధులతో ఒకటవ వార్డులో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేశామని పేర్కొన్నారు.

అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని, బిఆర్ఎస్ పార్టీ హయంలో జరిగిన అభివృద్ధి, అవలంబించిన ప్రజా సంక్షేమ పథకాలతోనే ఎవ్వరినోట విన్నా కేసిఆర్ మాటే వినిపిస్తుందని, కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ సకాలంలో అందేవి, జరిగేవి అని ప్రజలు ముక్తకంఠంతో చెపుతూ ఇప్పుడు అలాంటి పరిస్థితిలు లేవని బాధ పడుతున్నారని తెలిపారు. అన్నివర్గాల ప్రజలు కేసీఆర్ నీ పోగొట్టుకొని, తప్పు చేశామని పశ్చాతాప పడుతున్నారని, స్థానిక ఎమ్మెల్యే రెండేళ్ల నుండి శివనేనిగూడెంలో తట్టెడు మట్టి తీయలేదని, ఎన్నికల సమయంలో శిలాఫలకాలు మార్చి కొత్త శిలాఫలకాలు పెట్టి కొత్త శంకుస్థాపనలతో ప్రజలను మాయ చేస్తున్నారని విమర్శించారు. 

ఈ రెండేళ్లలో మున్సిపాలిటీకి ఏం చేశారో చెప్పే దమ్ము, ధైర్యం ఉంటే శ్వేతపత్రం విడుదల చేసి ఎన్నికలకు రావాలని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సవాల్ చేశారు. డంపింగ్ యార్డు విషయంలో స్థానిక ఎమ్మెల్యే ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నాడని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డంపింగ్ యార్డు పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దీనిపై ఎలాంటి తీర్మానం చేయలేదని వెల్లడించారు. మున్సిపాలిటీలో అభివృద్ధి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవ్వాలంటే బిఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శేపూరి రవీందర్, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.