calender_icon.png 1 August, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

01-08-2025 12:09:30 AM

నిజామాబాద్, జూలై 31 : (విజయ క్రాంతి): జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మోపాల్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిడ్డంగిలో రికార్డులలో పేర్కొన్న విధంగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు.

ఎరువుల విక్రయాలను ఈ-పాస్ ద్వారా నిర్వహిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. స్టాక్ కొంత మిగిలి ఉన్నప్పుడే ఇండెంట్ సమర్పించి, ఎరువులను గోడౌన్ కు తెప్పించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కాగా, ఎరువుల నిల్వలతో కూడిన వివరాలను స్టాక్ బోర్డు పై తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు.

ఎన్ని ఎరువుల గోడౌన్ లు, విక్రయ కేంద్రాలలో విధిగా స్టాక్ బోర్డులు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని ప్రాంతాలలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. యూరియా, ఇతర ఎరువుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు.