calender_icon.png 2 August, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఎన్ఎస్ లో తాత్కాలికంగా తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు నిర్ణయం

01-08-2025 09:04:34 PM

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోని సదుపాయాలు, వసతులను కల్పించి తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఇక్కడే తాత్కాలికంగా ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నామని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) తెలిపారు. శుక్రవారం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(Telangana Sports School cum Center of Excellence) తాత్కాలిక ప్రారంభానికి అవసరమైన సదుపాయాలను ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించి వసతులను పరిశీలించారు.

ఈ సందర్బంగా స్టేడియం ఆవరణలో ఉన్న హాస్టల్ భవనాలు, ఇండోర్, అవుట్ డోర్ క్రీడా మైదానాలను పరిశీలించి చేపట్టాల్సిన మరమ్మత్తులు, కల్పించాల్సిన సదుపాయాలను గురించి అధికారులకు సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థులకు క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలనీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డి వై ఎస్ ఓ అశోక్ కుమార్ ను స్టేడియంలో వసతి సౌకర్యాలపై వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహృదయంతో, వరంగల్ జిల్లా ప్రజలపై ఉన్న ప్రేమతో క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ మంజూరు చేయాలనీ అడిగిన వెంటనే ఒప్పుకున్నారని తెలిపారు. అలాగే వెంటనే స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తో త్వరితగతిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారని పేర్కొన్నారు.

ఈ ఆగస్టు నుండే స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ తాత్కాలిక ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని, అలాగే జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించినట్లు తెలిపారు.బిసిసిఐని సంప్రదించి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి నిధులు, అలాగే స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. అందులో భాగంగానే జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ని తాత్కాలికంగా ప్రారంభించడానికి ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, జిల్లా యువజన క్రీడాధికారి గుగులోతు అశోక్ కుమార్, స్పోర్ట్స్ అథారిటీ, కుడా, మున్సిపల్ అధికారులు, నాయకులు, కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.