01-08-2025 12:07:05 AM
మహబూబ్ నగర్ టౌన్: ప్రతి అంశంపై అవగాహన ఉండాలని డిఎస్పి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం పోలీసుల ఆధ్వర్యంలో “ప్రజా భద్రత – పోలీసు బాధ్యత” అనే కార్యక్రమం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. స్కూళ్ళు కాలేజీలు గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, చట్టాలపై అవగాహన కల్పించడం, నేరాల నివారణకు ప్రజలను చైతన్యవంతం చేయడం వంటి అంశాలపై వివరంగా వెల్లడించారు.
పోలీసుల ఉనికి మీ భద్రత కోసం" చట్టపరంగా జీవించే వారికి భయపడాల్సిన అవసరం లేదన్నారు.వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టడం సమాజ అభివృద్ధికి ఆటంకం కలిగించకూడదని పేర్కొన్నారు. ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్న ఎల్లప్పుడూ పోలీసులు రక్షణ కవచంలా ప్రజలకు ఉంటారని సూచించారు. జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు తావిచ్చిన వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరం సమానం అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని సూచించారు.