06-09-2025 12:00:00 AM
జైపూర్, సెప్టెంబర్ 5 : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం సమీప గోదావరి బ్రిడ్జి వద్ద ఏర్పాటుచేసిన నిమజ్జన ఘాట్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా గణేష్ శోభాయాత్ర కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో రూట్ మ్యాప్ రూపొందించామన్నారు.