06-09-2025 12:00:00 AM
కాగజ్‌నగర్, సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు నుండి వెలువడే కాలుష్యంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని ఆరోపిస్తూ శుక్రవారం పట్టణ ప్రజలు ఎస్ పి ఎం గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీ నుండి వెలువడే కెమికల్ పొగ వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
పొగతో పాటు దుర్గంధమైన వాసన రావడంతో శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ఆరోపించారు. పెద్ద ఎత్తున కాలుష్యం వెలబడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుండా చూస్తూ ఉంటున్నారని విమర్శించా రు.
గేటు ఎదుట ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న ఫ్యాక్టరీ ప్రతినిధులు అక్కడికి చేరుకొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలుష్యం వెలువడకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు.