11-12-2025 08:16:14 AM
హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు(Gram Panchayat elections) ప్రారంభం అయ్యాయి. 3,834 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తొలి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
తొలి విడతలో 396 సర్పంచ్ స్థానాలు, 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. తొలి విడతలో 05 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదని అధికారులు వెల్లడించారు. సర్పంచ్ ఎన్నికల(Sarpanch Elections) బరిలో12,960 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 65,455 మంది అభ్యర్థులు వార్డు మెంబర్ల బరిలో నిలిచారు. మొత్తం 189 మండలాల్లోని 3,834 గ్రామాల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి.