08-10-2025 12:42:37 AM
ఎస్పీ మహేష్ బి. గితే, ఐపీఎస్
రాజన్న సిరిసిల్ల: అక్టోబర్ 7(విజయక్రాంతి) ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని,మంగళవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సం దర్భంగా ఎస్పీ మాట్లాడుతూ . ఒక సామా న్య వ్యక్తిగా పుట్టి, బోయవాణిగా జీవితం గడిపి, సప్తర్షుల బోధనలతో మహర్షిగా మారి ఆదికావ్యం రామాయణం అనే అమరగ్రంథాన్ని మనకు అందించిన మహనీ యుడు వాల్మీకి మహర్షి ప్రతి ఒక్కరికి స్ఫూ ర్తి ప్రదాత అని అన్నారు.
కృషి, నిబద్ధత ఉం టే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు దీనికి వాల్మీకి మహర్షి జీవి త చరిత్ర నిలువెత్తు నిదర్శనం అని ఎస్పీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు స్పీ చంద్రయ్య, సి.ఐ లు రవి, నాగేశ్వరరావు, ఆర్.ఐ రమేష్, ఏ. ఓ పద్మ,జిల్లా పోలీసు అధికారులతో పాటు సిబ్బందిపాల్గొన్నారు.