08-10-2025 02:21:24 PM
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై బుధవారం పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ చొరవతో ఇద్దరి మధ్య వివాదం ముగిసింది. మంత్రి అడ్లూరికి వ్యక్తిగతంగా మంత్రి పొన్నం క్షమాపణలు చెప్పారు. తను ఆ మాట(దున్నపోతు) అనకపోయినా క్షమాపణలు చెబుతున్నానని, పత్రిక కథనాలతో మంత్రి అడ్లూరి మనస్తాపం చెందారని ఆయన తెలిపారు.
మనస్తాపం చెందిన 'అడ్లూరికి క్షమాపణలు చెబుతున్నా, ఆయనకు, నాకు పార్టీ సంక్షేమం తప్ప మరో దురుద్దేశం లేదు' అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలమంతా ఐక్యంగా సామాజిక న్యాయం కోసం పని చేస్తామని పొన్నం పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ముఖ్య నేతలు మంత్రుల మధ్య సయోధ్య కుదుర్చారు. అనంతరం ఒక్కరినీ ఒక్కరూ ఆలింగనం చేసుకొని, అందరూ కలిసి భోజనం చేశారు.