calender_icon.png 8 October, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్ ఆసుపత్రి వార్షిక తనిఖీ చేసిన ఏఎస్ సీఐ బృందం

08-10-2025 02:03:29 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని(Khanapur Hospital) వంద పడకల అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా బృందం డీన్ డాక్టర్ శుభోద్ కందముతో అన్నారు. బుధవారం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని వారు వార్షిక తనిఖీ చేసేందుకు వచ్చారు. దీంట్లో భాగంగా ఆసుపత్రిలో వసతులను పరిశీలించి, అవసరతలు పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ఆయన విలేకరులకు తెలియజేశారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు పై విధంగా వారు స్పందించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ వంశీ ,డాక్టర్ స్వర్ణ రెడ్డి ,సిబ్బంది తదితరులు ఉన్నారు.