12-08-2025 12:00:00 AM
వరంగల్, ఆగస్టు 11 (విజయ క్రాంతి): జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి ప్రారంభించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం హైస్కూల్లో సోమవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని పాఠశాలల విద్యార్థులందరికీ నులిపురుగుల నివారణ మందులు మింగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టు మాసాలలో పిల్లల్లో రక్తహీనతను నివారించడానికి నులిపురుగుల నివారణ దినోత్సవం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగింది.
చిట్యాల, ఆగస్టు 11(విజయ క్రాంతి):ఆల్బెండజోన్ మాత్రలతో నులిపురుగులను నివారించవచ్చని ఒడితల పీఎ సీ డాక్టర్ మమత తెలిపారు.సోమవారం మండలంలోని ఒడితల గ్రామంలోని వివేకానంద హై స్కూల్ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఆమె ఘనంగా నిర్వహించారు.మనిషి జీర్ణాశయ గోడలను అంటుకొని నూలి పురుగులు, కుంకి పురుగులు, ఎలుక పాములు,పరాన్న జీవులు ఉంటాయని తెలిపారు.
మనిషి భుజించిన ఆహారాన్ని తిని శారీరకంగా ఎదగాకుండా అనారోగ్య%ళి% కలుగ చేస్తాయని తెలిపారు.నూలి పురుగుల నిర్మూలనకు 400 ఎంజి మాత్రల ను వేసుకోవడం ద్వారా నులిపురుగులను నిర్మూలించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్,సంజీవరెడ్డి,స్వరూప ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.