calender_icon.png 12 August, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ కళాశాల ఎదుట ధర్నా

12-08-2025 12:00:00 AM

మహబూబాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల విద్యార్థుల హాస్టల్ భవనాలను ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ మహబూబాబాద్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం గందసిరి జ్యోతి బసు, పట్ల మధు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా మెడికల్ కళాశాల ఏర్పడి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా, విద్యార్థులకు హాస్టల్  ఏర్పాటు చేయలేదని విమర్శించారు.

62 మంది మెడికో విద్యార్దులను అకారణంగా ఇంటికి పంపివేశారన్నారు. అధికారులు స్పందించి హాస్టల్ భవనాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ నాయకులు బానోత్ సింహద్రి, భాషాపాక పవన్, గుండ్ల రాకేష్ , మహేష్, వినోద్, ప్రవీణ్, యాకన్న , ప్రమోద్, నరేష్ పాల్గొన్నారు.