11-08-2025 11:08:29 PM
- క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
- విచారించి పీడియాక్ట్ నమోదు చేయాలని ఆదేశం
- వెంటనే తిరిగి మరమ్మత్తు పనులు చేపట్టాలి
కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం(Kalwakurthy Constituency) వెల్దండ మండలం లచ్చపురం గ్రామ సమీపంలోని డీ82 కేఎల్ఐ కాల్వకు పడిన గండి దుండగుల పనేనని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayan Reddy) అనుమానిస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న అక్కస్సుతో గుర్తు తెలియని వ్యక్తులు నీటి పేరుతో కాలువలకు గండ్లు పెడుతున్నారని అలాంటివారిని గుర్తించి పీడియాట్ నమోదు చేయాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు. సోమవారం గండిపడిన కేఎల్ఐ కాల్వతో పాటు వరద నీటితో నష్టపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. వెంటనే గండి పడిన కాల్వను పునరుద్ధరించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.