19-01-2026 05:25:14 PM
కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ కార్టూనిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర డిగ్రీ, పీజీ కళాశాలలో రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం ప్రారంభించారు. ఎస్ఆర్ఆర్ కళాశాల తెలుగు విభాగం సహకారంతో సోమ, మంగళవారాల్లో ఈ కార్టూన్ల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలలకు చెందిన వివిధ కార్టూనిస్టుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని, ఆలోచింపజేస్తున్నాయని అన్నారు.
యువతను కార్టూనిస్టులుగా ప్రోత్సహించాలని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కార్టూనిస్టులు పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కార్టూనిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి, రిప్రెజెంటివ్ పర్సన్ కళ్యాణం శ్రీనివాస్, ఎస్ ఆర్ ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట రామకృష్ణ, తునికి భూపతి, సుమన్, గుండు రమణయ్య, డేవిడ్, సంతోష్ కౌటం, బండి రవీందర్, తెలుగు విభాగం అధ్యాపకులు, కార్టూనిస్టులు పాల్గొన్నారు.