calender_icon.png 19 January, 2026 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దకాపర్తిలో ఉచిత దంత వైద్య శిబిరం

19-01-2026 05:27:27 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం  పెద్దకాపర్తి గ్రామంలో స్థానిక గ్రామ సర్పంచ్ కాట వెంకటేశం నేతృత్వంలో నార్కట్‌పల్లి లోని కామినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్  విద్యార్థులు, వైద్యుల బృందం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు ప్రజలకు నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. నిత్యం పళ్ళు తోముకోవడంలో పాటించాల్సిన మెళకువలు, నోటి పరిశుభ్రతకు సంబంధించిన జాగ్రత్తలను వివరించారు. దంత సమస్యలు ఉన్నవారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అవసరమైన వారిని గుర్తించారు.

వీరికి ఆసుపత్రిలో ఉచితంగా మెరుగైన చికిత్స అందిస్తామని వైద్యులు హామీ ఇచ్చారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లే రోగుల సౌకర్యార్థం ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించారు. పి. ఆర్. ఓ. చంద్రశేఖర్, డాక్టర్ పార్థ, పీరియాడాంటిస్ట్, డాక్టర్ పి. సంహిత,డాక్టర్ పి. దినేష్, డాక్టర్ ఎమ్. సింధుజ, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు,వార్డ్ మెంబర్లు యాదయ్య, తెలుసూరి నరసింహ, పంచాయతి సెక్రటరీ గౌతమ్ రెడ్డి,పలువురు విద్యార్థులు పాల్గొని గ్రామస్తులకు సేవలు అందించారు.