calender_icon.png 8 October, 2025 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ నివాళి

08-10-2025 12:00:00 AM

నిర్మల్, అక్టోబర్ 7(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత భవన్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహర్షి చిత్రపటానికి కలెక్టర్ అభిలాష అభినవ్ పూలమా లవేసి నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి రచించిన కావ్యాలను నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ రత్న కళ్యాణి బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మోహన్ సింగ్ అధికారులు రాంగోపాల్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.