08-10-2025 12:00:00 AM
ఆదిలాబాద్, అక్టోబర్ 7(విజయక్రాంతి): సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై ఒక కేసు విషయంలో న్యాయవాది చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ ని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ అన్నారు. సీజెఐపై దాడిని ఖండి స్తూ మంగళవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు నగేష్ మాట్లాడు తూ... సీజెఐపై దాడి యత్నం దురదృష్టకరమని, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన హేయమైన చర్యగా భావిస్తున్నామని. దాడికి యత్నించిన సంబంధిత న్యాయవాదికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామని, ఆయన చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, పలువురు న్యాయవాదు లు పాల్గొన్నారు.