25-01-2026 03:44:43 PM
సర్పంచ్ మల్లెపాక సాయిబాబా
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని 234 బూత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 130వ ఎపిసోడ్ ను బీజేపీ శ్రేణులు ఆదివారం వీక్షించారు. మన్ కీ బాత్ వల్ల దేశాల్లోని మారుమూల గ్రామాల్లో జరుగుతున్న విశేషాలు, మానవ అభివృద్ధి, ఆలోచనలు బయటకు తెలుస్తాయని సర్పంచ్ మల్లెపాక సాయిబాబా అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రజలు చైతన్యవంతులుగా ఉండాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు.