20-12-2025 09:38:48 PM
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని శ్రీ.శ్రీ నగర్ లో వీ మార్ట్ (V Mart) వద్ద ప్రారంభించనున్న ఐటీ కంపెనీ (IT COMPANY), సాప్ట్ వేర్ ట్రైనింగ్ సెంటర్ (SOFTWARE TRAINING CENTER), స్టార్ట్ అప్ (STARTUP)కి సంబంధించిన వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తన చాంబర్ లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మోతే శరత్ చంద్ర, సైకాలజిస్ట్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ లతో కలిసి ఆవిష్కరించారు.
మంచిర్యాలలో ఈ తరహా ఐటీ టూల్స్ తో ప్రారంభించనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డాటా సైన్సెస్ (DATA SCIENCES), ఎమ్ బేడెడ్ సిస్టమ్స్ (EMBEDDED SYSTEMS), రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సాప్ట్ వేర్ స్కిల్ డెవలప్ మెంట్ (SOFTWARE SKILL DEVELOPMENT), తదితర సదుపాయాలతో త్వరలో ప్రారంభించడం అభినందనీయమన్నారు.