calender_icon.png 20 December, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారు దుకాణంలో చోరీ..

20-12-2025 09:41:20 PM

 రూ. రెండున్నర లక్షల విలువైన వెండి నగలు అపహరించిన మహిళలు..

వెంకటాపురం(నూగూరు),(విజయక్రాంతి): మండల కేంద్రంలోని జై గణేష్ జూవెలర్స్ లో గుర్తుతెలియని మహిళలు శనివారం దుకాణంలోకి ప్రవేశించి వెండి నగలను అపహరించారు. దుకాణం యజమాని తన వ్యక్తిగత పనుల నిమిత్తం శనివారం ఉదయం వరంగల్ వెళ్ళాడు. షాపులో గుమస్తాను ఉంచాడు. మధ్యాహ్న సమయంలో గ్రామంలో ఏడుగురు వేరే ప్రాంతానికి చెందిన మహిళలు షాపులోకి వెండి ఆభరణాల కొనుగోలు నిమిత్తం అని వచ్చారు. దుకాణల సమయంలో గుమస్తా ఒక్కడే ఉండగా వస్తువులను చూపిస్తున్న క్రమంలో అతని కళ్ళు కప్పి ఏడుగురులో ఓ మహిళ వెండి పట్టీలు గల బాక్స్ను అపహరించింది.

గుమస్తా వస్తువులను చూపిస్తున్న క్రమంలోనే అతని కళ్ళుగప్పి తన చీరలో నగలు బాక్స్ను పెట్టుకుని మెల్లగా మహిళలు ఒకరి తర్వాత ఒకరు అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. వారి వెళ్ళినంతరం బాక్సులను గుమస్తా పరీక్షించుకోగా ఒక బాక్స్ లేకపోవడం గమనించి యజమానికి సమాచారం అందించారు. యజమాని సీసీటీవీని పరిశీలించగా మహిళలు వెండి పట్టీలు బాక్సును మాయం చేసినట్లు గమనించాడు. యజమాని గ్రామంలో లేకపోవడంతో గుమస్తా స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ సంఘటనపై దొంగలు ఎటువైపుగా వెళ్లారనే విషయంపై సీసీటీవీ లను గ్రామంలో పరిశీలిస్తున్నట్లు సమాచారం.