20-12-2025 09:36:36 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్,(విజయక్రాంతి): ఈ నెల 22న సాధారణ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నందున ఈ నెల 29వ తేదీ నుంచి ప్రజావాణి యధాతథంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం వెల్లడించారు. 22న ప్రమాణ స్వీకారోత్సవ పనులలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంటారని, ఈ కారణంగా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం వాయిదా వేస్తూ ఈ నెల 29 నుంచి యధాతధంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.