calender_icon.png 21 December, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశంస పత్రం అందుకున్న తాసిల్దార్ కు ప్రత్యేక అభినందనలు

20-12-2025 09:58:18 PM

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి):  ప్రజావాణి రెండో వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ప్రశంస పత్రం అందుకున్న కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్ జగదీశ్వర్ రావుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రత్యేక అభినందనలు తెలిపారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షను రాష్ట్రస్థాయి ప్రశంసపత్రం గ్రహీత కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్ జగదీశ్వర రావు మర్యాద పూర్వకంగా కలిశారు.

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం అమలులో మంచి పనితీరు కనబరిచిన కాల్వ శ్రీరాంపూర్  తహసిల్దార్ ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో జరిగిన కార్యక్రమంలో  రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నా రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందించిందని, భవిష్యత్తులో కూడా ఇదే పనితీరు కనబర్చాలని, పెద్దపల్లి జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం లో  ముందంజలో ఉందని, ప్రశంసిస్తూ ,ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.