calender_icon.png 21 December, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారి కోసం రేపాక గ్రామస్తుల ధర్నా

20-12-2025 09:55:46 PM

కంకర పోసి రోడ్డు మరిచారంటు నిరసన

రేగొండ,(విజయక్రాంతి): అధికారుల నిర్లక్ష్యం పాలకుల అలసత్వం రేపాక గ్రామ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అయ్యేలా చేసింది.గత ఏడాది కాలంగా అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను నిరసిస్తూ శనివారం చిట్యాల రేగొండ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. మండలంలోని రేపాక గ్రామం నుండి రైతు వేదిక వరకు రోడ్డు వేస్తామని చెప్పి ఏడాది క్రితం కంకర పోసి రోడ్డు వేయడం వదిలేసారని దీంతో ఏడాదిగా కంకర రోడ్డుపై ప్రయాణించడం ప్రాణ సంకటంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాహనాలు అదుపుతప్పి చాలామంది గాయపడ్డారని మండిపడ్డారు. రహదారిపై వాహనాలు వెళ్తున్నప్పుడు వచ్చే దుమ్ము ధూళితో ఇళ్లలో ఉండలేకపోతున్నామని, శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నామని వాపోయారు.రోడ్డు నిర్మించేలా అధికారులు, పాలకవర్గం చర్యలు చేపట్టేలా నినదిస్తూ గ్రామ ప్రజలు దాదాపు అరగంటకు పైగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గ్రామ ప్రజలు మాట్లాడుతూ తమకు సిసి రోడ్డు వద్దని నాణ్యమైన తార రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించకుంటే రెండు రోజుల్లో రేగొండ మండల కేంద్రంలో గ్రామ ప్రజలతో భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు.