20-12-2025 09:53:33 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పీర్జాదిగూడ సర్కిల్ 19వ డివిజన్ శానిటేషన్ సిబ్బందికి శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కాలనీలను శుభ్రంగా ఉంచుతూ నిరంతరం సేవలందిస్తున్న శానిటేషన్ సిబ్బందిని పీర్జాదిగూడ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ త్రిలేశ్వర్ రావు,పీర్జాదిగూడ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో కాలనీ వాసులు విజయ్ కుమార్, రాఘవేందర్ లు సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బంది చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ, ప్రజా ఆరోగ్య పరిరక్షణలో వారి పాత్ర అత్యంత కీలకమని అన్నారు.ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్,వార్డ్ ఆఫీసర్ రాజేష్ కుమార్, మున్సిపల్ సిబ్బంది పవన్, నరేష్, వెంకటయ్య, అశోక్, పద్మ, అశ్వంత్, నాగమ్మ, శాంతమ్మ, ప్రమీల, సుగుణ తదితరులు పాల్గొన్నారు.