calender_icon.png 23 July, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు విద్యాసంస్థలు బంద్

23-07-2025 01:26:29 AM

  1. వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపు
  2. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని  పాఠశాలలు, జూనియర్ కాలేజీల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చా యి. దీంతో బుధవారం (23న) విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. అ యితే ఇప్పటికే కొన్ని విద్యాసంస్థలు ముందస్తుగా సెలవును ప్రకటించగా, మరికొన్నేమో సెలవును ప్రకటించలేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల బంద్‌ను  విద్యార్థి సంఘాలు చేపట్టనున్నాయి.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న విద్యారంగ సమస్యల ను పరిష్కరించడంతోపాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌ఓ, ఏఐఎస్‌బీ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐపీఎస్‌యూ బుధవారం బంద్ ను పాటించనున్నాయి. ప్రభుత్వ వి ద్యాసంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీ, ప్ర భుత్వ జూనియర్ కాలేజీల్లో మ ధ్యా హ్న భోజన పథకం విస్తరణ, టీచర్, ఎంఈవో, డీఈవో, తదితర పోస్టుల భర్తీ చేయాలని  కోరుతున్నాయి.