calender_icon.png 23 July, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుల పంపిణీ రసాభాస

23-07-2025 01:16:54 AM

సిద్దిపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్

  1. పోటాపోటీగా ఇరు వర్గాల నినాదాలు 
  2. సముదాయించిన మంత్రి వివేక్, మాజీ మంత్రి హరీశ్
  3. రాజకీయం చేయొద్దంటూ వివేక్ అసహనం 
  4. బీఆర్‌ఎస్ కార్యకర్తలను బయటకు పంపిన పోలీసులు

సిద్దిపేట, జూలై 22 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. వేదిక ముందు కూర్చుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకట స్వామి, మాజీ మంత్రి హరీశ్‌రావు కలుగజేసుకుని ఇరు పార్టీల కార్యర్తలను సముదాయించారు.

ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మంగళవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఏర్పా టు చేశారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజర య్యా రు.

సమావేశానికి కలెక్టర్ స్వాగతం పలుకుతున్న సందర్భంలోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు సముచిత గౌరవం ఇవ్వడం లేదం టూ ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి వివేక్ జోక్యం చేసుకొని సమావేశాన్ని ప్రారంభించే క్రమంలో గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ సమావేశానికి ఎందుకు రాలేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించారు.

కేసీఆర్ డౌన్, డౌన్ అంటూ నినాదా లు చేయడంతో అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు సైతం సీఎం డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఫొటో లేదంటూ ఫ్లెక్సీని తొలగించే ప్రయ త్నం చేయగా ఆ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం హరీశ్‌రా వు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంలో సిద్దిపేట జిల్లాకు 40 నుంచి 60 శాతం నూకలు ఉన్న బియ్యం సరఫరా అయ్యాయని మంత్రికి వివరించారు.

రైతులకు కేవలం 30 శాతం మాత్ర మే రుణమాఫీ చేశారని రూ.2లక్షల లోపు ఉన్నవారందరికీ రుణమాఫీ కాలేదన్నారు. రూ.2 లక్షల పైన రుణం కలిగిన రైతులు, ఆ పైన మొత్తాన్ని బ్యాంకులో చెల్లించినప్పటికీ వారికి సైతం రుణం మాఫీ కాలేదంటూ మంత్రికి వివరించారు. ఈ క్రమంలో కాంగ్రె స్ కార్యకర్తలు ఒక్కసారిగా హరీశ్‌రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దాంతో మరోసారి బీఆర్‌ఎస్ కార్యకర్తలు వేదిక వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.

వేదిక ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు బీఆర్‌ఎస్ కార్యకర్తలను హాల్‌లో నుంచి బయటకు పంపించారు. మంత్రి వివేక్, ఎమ్మెల్యే హరీశ్‌రావు జోక్యం చేసుకొని ఇరువర్గాలను సముదాయించారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ.. రేషన్‌కార్డుల పంపిణీని రాజకీయం చేయొ ద్దంటూ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కిందన్నారు.

ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, మెదక్‌లలో తాను పర్యటించినప్పుడు రేషన్ బియ్యం రైతుల సమస్య ఎక్కడా ప్రస్తావనకు రాలేదని ఇది కేవలం సిద్దిపేటలోనే చూశారంటూ పరోక్షంగా విమర్శించారు. రేషన్ కార్డుల పంపిణీ ఆలస్యానికి ప్రధానమైన కారణం ఉన్నదన్నారు. రేషన్ కార్డు ఒకటే ప్రభుత్వ పథకాలకు సూచికగా ఉండే విధంగా రూపొందించినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం 600 చ.అ.లు మాత్ర మే నిర్మించుకోవాలని, అంతకుమించి నిర్మించుకుంటే పథకం అమలు కాదని వెల్లడించా రు.

నాయకులు లబ్ధిదారులకు స్పష్టం గా వివరించాలని, పైరవీలు చేసిన ఫలితం ఉండదు అంటూ ఘాటుగానే సూచించారు. యూరి యా కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి మాట్లాడుతుం డగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయ డంపై అసహనం వ్యక్తం చేశారు.

ఇది సంక్షేమ పథకం అని ఇక్కడ రాజకీయం చేయవద్దంటూ కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్లు గరీమ అగర్వాల్, అబ్దుల్ హమీద్, సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేరు మంజుల, తొగుట ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు అవమానం

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో అవమానం జరిగింది. తన సొంత జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి కార్యక్రమానికి అధికారులు ప్రొటోకాల్ ఆధారంగా ఆహ్వానించలేకపోవడం ఒకటైతే, జిల్లాకు వస్తున్నట్లు మంత్రి కమిషన్ చైర్మన్‌కి సమాచారం ఇచ్చి ఆహ్వానించడం వల్ల ఆయన సమావేశానికి హాజర య్యారు.

కానీ వేదికపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు కుర్చీ ఏర్పాటు చేయకపోవడం, తన నేమ్ ప్లేట్, ఫ్లెక్సీపైన ఫొటో లేకపోవడం మరింత అవమానానికి దారితీసిందని సమావేశంలో చర్చ సాగింది. వేదికపై కుర్చీ ఏర్పాటు చేయాలంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించడంతో అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో ఇదేమి కొత్త కాదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు తప్పులు చేయడం బాధాకరమని చైర్మన్ వెల్లడించారు.