ఆర్మూర్‌లో అనవసరంగా మతం రంగు రుద్దుతున్నారు
ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నేతల కుమ్మక్కు
ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత తగాదాలకు మతం రంగు
ఆర్మూర్ హిందువులు, ముస్లిం సోదరులు శాంతిని కోరుకోవాలి
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
కామారెడ్డి, జూన్ 29 (విజయక్రాంతి): శాంతియుతంగా ఉన్న ఆర్మూర్లో ఎంఐఎం, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు మతం రంగు పూసి రెచ్చగొడుతున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకొని ఆయనను కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలించిన అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా ఉన్న ఆర్మూర్ ను కొందరు ఎంఐఎంతో కుమ్మక్కై అనవసరంగా మతం రంగు రుద్ది విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆర్మూర్ ప్రజలు శాంతియుత వాతావరణాన్ని కల్పించాలని కోరారు. ముస్లిం పెద్దలు, హిందువులు రెచ్చగొట్టే వారి మాటలు వినవద్దన్నారు. ప్రశాంతమైన ఆర్మూర్లు ఎంఐఎం గుండాలు వచ్చి రెచ్చగొట్టి రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. పెరికిట్ గ్రామంలో ఉన్న ఒక స్కూల్లో హిందూ పిల్లలకు మతమార్పిడి చేసేందుకు ఖురాన్ చదవడం నమాజ్ చేయడం నేర్పిస్తున్నారని అన్నారు.
హిందువులు మదర్సాలకు వచ్చి ముస్లిం విద్యార్థులను హిందూమతంలో కలవాలని రెచ్చగొడుతున్నారా ముస్లిం పెద్దలు ఆలోచించాలన్నారు. హిందువుల పిల్లల తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా స్కూల్ ప్రిన్సిపాల్ ఇమ్రాన్ ఖాన్ ఐఎస్‌ఐతో సంబంధాలు పెట్టుకుని అనవసరంగా హిందువుల పిల్లలకు ఖురాన్, నమాజ్ నేర్పించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. హిందూ విదేశీ సమస్య శక్తుల నుండి నిధులతో హిందువులను మతమార్పిడి చేయాలని కుట్ర పన్నుతున్నారన్నారు.
ఎన్ ఐ తో ప్రిన్సిపల్ పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి కొందరు గుండాల నార్మల్ లోకి వచ్చి గొడవలు చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించవద్దని ముస్లిం పెద్దలను కోరారు. ఇద్దరి మధ్యలో జరిగిన గొడవ అనవసరంగా పెద్దది చేయాలని కొన్ని పార్టీలు చూస్తున్నా యని ఆరోపించారు. శాంతియుతంగా మతసామరస్యంగా ఉండే ఆర్మూర్లు లో ఎంఐఎం, కాంగ్రెస్, టిఆర్‌ఎస్ నాయకులు కలిసి అశాంతి నీ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అలాంటి వారిని నమ్మవద్దన్నారు. ముస్లిం పెద్దలు, హిందూ పెద్దలతో చర్చించి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఆర్మూర్ వెళ్తుంటే పోలీసులు అకారణంగా అడ్డుకొని ఆర్మూర్ కు వెళ్లకుండా అడ్డుకుని కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలించారని రాకేశ్ రెడ్డి తెలిపారు.
శాంతి యూత మైన ఆర్మూర్ ను కోరుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముస్లిం పెద్దలు, హిందూ సమాజం ఎవరి మాటలకు రెచ్చిపోకుండా ప్రజలంతా కలిసి శాంతియుతమూగ ఉండాలని శాంతియుత ఆర్మూర్ గా మార్చాలని కోరారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, పట్టణ బిజెపి అధ్యక్షులు మోటూరి శ్రీకాంత్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు విపుల్ జైన్, బిజెపి కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.






