ప్రజాస్వామ్యం బలోపేతానికి సహకరించాలి
మాజీ కార్పొరేటర్ వెంకటేశ్
జూబ్లీహిల్స్, జూన్ 29 (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ఓటర్లంతా స్వచ్ఛందంగా పాల్గొని ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలని మాజీ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ కోరారు. జూబ్లీహిల్స్ డివిజన్ అంబేద్కర్ నగర్లో సోమవారం జరిగిన ఓ టరు జాబితా సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫా రం నింపే ప్రక్రియను గురించి వివరించారు. అర్హులైన ప్రతిఒక్కరి ఓటును పరిరక్షించడం తమ బాధ్యత అన్నారు.
వివరాలను సక్రమంగా నమోదు చేయడం ద్వారా ఓటరు జాబితాలో ఓటరు పేరు పదిలంగా ఉంటుందన్నారు. తద్వారా ప్రజాస్వామ్యం బలో పేతమవుతుందన్నారు. అర్హత కలిగిన పౌరు లు నూతన ఓటరుగా పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓ శారద, స్థానియ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






