calender_icon.png 16 October, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంద్‌కు ప్రజలు సహకరించాలి

16-10-2025 01:08:34 AM

  1. 130 కుల, 30 బీసీ, ఉద్యోగ సంఘాల మద్దతు

18న రాష్ట్ర బంద్‌తో గల్లీ నుంచి ఢిల్లీ వరకు సెగ పుట్టిస్తాం 

17న బషీర్బాగ్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ

బీసీ కుల, ఉద్యోగ సంఘాల సమావేశంలో జేఏసీ చైర్మన్, ఎంపీ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల

ముషీరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఈ నెల 18న రా ష్ట్రంలో జరిగే బంద్‌లో సబ్బండ కులాలు పాల్గొని చరిత్ర సృష్టించాలని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర బంద్‌కు మద్దతుగా బుధవా రం హైదరాబాద్ కాచిగూడలోని హోటల్ అభినందన్ గ్రాండ్స్‌లో 130 బీసీ కుల, 30 బీసీ, ఉద్యో గ, ఉపాధ్యాయ సంఘాల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిధు లుగా ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెంచిన బీసీ రిజర్వేషన్లను తగ్గించడానికి అనేకమంది కుట్రలకు పాల్పడుతున్నారని, ఇందుకు కోర్టులను వేదికలుగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ వ్యతి రేకులను ఎండగట్టి రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ల సాధన కోసం బంద్‌ను చేపడుతున్నట్టు చెప్పారు. బీసీ రిజర్వేషన్లు పెంచడం ద్వారా అన్ని కులాలకు రాజకీయ ప్రాతిథ్యం పెరుగుతుందని, అంతిమంగా రాజ్యాధికారంలో బీసీలకు జనాభా దామా షా ప్రకారం వాటా దక్కుతుందని పేర్కొన్నారు.

రాష్ట్ర బంద్‌కు రోజురోజుకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతున్నదని, అన్ని కులాలు ఏకమై బంద్‌లో పాల్గొని బీసీల ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలు, వ్యాపారులు, విద్యాసం స్థలు, పె ట్రోల్ బంక్ యజమాన్యా లు, ఆర్టీసీ, రవా ణ వ్యవస్థ బంద్ రోజు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర బంద్ నిర్వ హించడం ద్వారా బీసీ డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపించగలుగుతామని, గల్లీ నుంచి ఢిల్లీ దాకా సెగ పుట్టిస్తామని వివరించారు.

పీ పురుషోత్తం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీ జేఏసీ కో చైర్మన్లు వీజీఆర్ నారగోని, దాసు సురేశ్, మీడియా కో-ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కనకల శ్యాం కుర్మా, ఏం చంద్రశేఖర్‌గౌడ్, శేఖర్ సగర, ధీటి మల్లయ్య, మహేశ్ యాదవ్, హౌలా చంద్రశేఖర్, జగన్నాథం, జ్ఞానేశ్వర్, గుజ్జ సత్యం, రామకోటి, నీల వెంకటేశ్, వేముల రామకృష్ణ, వరికుప్పల మధు, వెంకటేశ్‌గౌడ్, పానుగంటి విజయ్, నరసింహ నాయక్ తదితరులు పాల్గొన్నారు.