calender_icon.png 23 August, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ స్వదేశీ మేళాకు రండి

25-01-2025 01:02:59 AM

గవర్నర్‌ను కోరిన స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రతినిధులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (విజయక్రాంతి): స్వదేశీ జాగరణ్ మంచ్ అఖిల భారత సహ సంఘటన మంత్రి సతీష్‌జీ నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను శుక్రవారం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆయనతో పలు అంశాలపై చర్చించారు. త్వరలో కరీంనగర్‌లో జరుగబోయే స్వదేశీ మేళా గురించి వివరించి, ఆ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రాంత సంయోజక్ హరీశ్‌బాబు, స్వావలంభి భారత్ అభియాన్ ప్రాంత కో ఇంద్రసేన్‌రెడ్డి, స్వదేశీ జాగరణ్‌మంచ్ ప్రాంత ప్రముఖ్ కేశవ్‌సోని, సావలంబి భారత్ అభియాన్ సభ్యులు సుధాకర్‌శర్మ, మహేశ్ ఉన్నారు.