23-08-2025 09:30:24 PM
దౌల్తాబాద్: వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన దౌల్తాబాద్ మండల(Doultabad Mandal) పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. దౌల్తాబాద్ ఎస్సై అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్ట సత్తయ్య(60) వ్యవసాయంలో నష్టం రావడం వల్ల మనస్థాపానికి గురై తన అల్లుడు మరికంటి స్వామికి ఫోన్ చేసి నేను చనిపోతున్నానని తెలుపగా వెంటనే మృతుడి పెద్ద కుమారుడు నరేష్ కు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న నరేష్ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా తండ్రి పుట్ట సత్తయ్య చింత చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుని కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు.