23-08-2025 10:45:48 PM
పోలీసుల అదుపులో తొమ్మిది మంది
చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామ సమీప గోదావరి పరివాహక ప్రాంతంలో జరుగుతున్న కోడిపందాలలో చెన్నూరు, మహారాష్ట్ర ప్రాంతాలవారు పాల్గొంటున్నారని ముందస్తు సమాచారంతో శనివారం కోటపల్లి ఎస్ఐ రాజేందర్, పోలీసు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేశారు. చమత్కారి శంకర్, పాలరపు సమ్మయ్య, గగ్గూరు తిరుపతి, రమేష్ మదనయ్య, గంట రవి, తుంగపిండి శ్రీకాంత్, ఆలం చిరంజీవి, పోలోజు సుధాకర్, సదయ్యలను అదుపులోకి తీసుకోగా మరికొందరు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. పట్టుబడిన వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, రెండు కోళ్లు, రూ. 5,400 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. కోడిపందాలు వంటి చట్టవ్యతిరేక చర్యల్లో పాల్గొనేవారిపై ఎలాంటి ఉపశమనం ఉండదని, కేసులు నమోదు చేసి శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.