23-08-2025 09:14:19 PM
ముత్యాల విశ్వనాథం
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పాల్వంచ రైతులకు యూరియా ఇవ్వాలని రైతు సంఘం జాతీయ సమితి సభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం(CPI State Executive Member Mutyala Vishwanatham) కోరారు. శనివారం పాల్వంచ విశాల సహకార సంఘం ఆఫీస్ వద్ద బారులు తీరిన రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా రైతులకు అందించడంలో విఫలం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన యూరియాని వెంటనే తెప్పించి రైతులకు సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల్ని సమకూర్చే పెద్ద ఎత్తైన ఉద్యమిస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు జిల్లా సమితి సభ్యులు నిమ్మల రాంబాబు రైతులు తదితరులు పాల్గొన్నారు.