calender_icon.png 24 August, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులు అరెస్టు

23-08-2025 09:24:07 PM

చివ్వెంల (విజయక్రాంతి): చివ్వెంల మండలంలో హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులు అరెస్టు 2025 ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం సమయంలో చివ్వెంల మండలం కుడకుడ గ్రామ శివారులోని మధురా వైన్స్ వద్ద, అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మయ్యపై నలుగురు వ్యక్తులు కర్రలతో దాడి చేసి హత్యాయత్నం చేసిన సంఘటన జరిగింది. ఈ మేరకు చివ్వెంల పోలీస్ స్టేషన్ లో క్రైం.నెంబర్ 243/2025, సెక్షన్లు 115(2), 117(2), 326(2), 307 r/w 34 BNS చట్టం ప్రకారం ఎస్సై వి. మహేశ్వర్(SI Maheshwar) కేసు నమోదు చేసారు.

నిందితులు 1. దండుగుల శేఖర్, 2. పల్లపు గోపి, 3. పల్లపు రాము,4. పసుపుల చంటి, దండుగుల శేఖర్ (A1) దండుగుల లక్ష్మయ్య భార్య వెంకటమ్మతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వలన పూర్వం గొడవలు జరగడం తో పాటు పల్లపు గోపి (A2) కు రాయి పనుల వివాదంలో దండుగుల లక్ష్మయ్యతో గొడవలు జరగడం.ఈ ద్వేష భావనలతో నిందితులు నలుగురూ కలిసి దండుగుల లక్ష్మయ్యను హత్య చేయాలని పథకం వేసారు. 2025 ఆగస్టు 22న నిందితులు పథకం ప్రకారం దండుగుల లక్ష్మయ్యను చివ్వెంలకు పిలిచి, కర్రలతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు.

బాధితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడంతో నిందితులు కారులో వెంబడించారు. మధురా వైన్స్ వద్ద అతనిపై దాడి చేయాలని యత్నించినా, అక్కడ ప్రజలు ఎక్కువగా ఉండడంతో విఫలమై కర్రలను అక్కడే వదిలేసి కారులో పారిపోయారు.2025 ఆగస్టు 23 ఉదయం, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి. రాజశేఖర్ ఆద్వర్యంలో  చివ్వెంల పోలీసులు సుందరయ్య నగర్, సూర్యాపేట టౌన్లో  నలుగురు నిందితులను పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో రిమాండ్ కు  పంపించారు అని DSP వి. ప్రసన్న కుమార్ తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో సీఐ రాజశేఖర్ ,ఎస్సై వి. మహేశ్వర్ మరియు చివ్వెంల సిబ్బంది పాల్గొన్నారు.