23-08-2025 10:32:03 PM
టి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు బొట్ల బిక్షపతి మాదిగ
హనుమకొండ,(విజయక్రాంతి): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను దేశ ప్రస్తుత పరిస్థితుల దృశ్య ఈ సమ్మెను జూలై 9 కి వాయిదా వేసిన సందర్భంగా శనివారం జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఏఐటియుసి, టిఎంఆర్పిఎస్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హనుమకొండ లోని అంబేద్కర్ సెంటర్ విగ్రహం ముందు నిరసన ధర్నా చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎంఆర్పీఎస్, ఏఐటీయుసీ, అధ్యక్షులు బోట్ల బిక్షపతి మాదిగ, వేల్పుల సారంగపాణి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని అదేవిధంగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కుల చట్టాలను 4 కోడ్ లుగా విభజించి బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారులకు భారీ పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చట్టాలు మార్చడం వల్ల కార్మికులు మరింత శ్రమ దోపిడీకి గురే అవకాశం ఉందని, గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసర ధరలు పెరగడంతో కార్మికులకు వచ్చే వేతనం సరిపోక అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా పెరిగిన నిత్యవసదొరలను తగ్గించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.