calender_icon.png 24 August, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా జనహిత పాదయాత్రలో అందరూ భాగస్వాములు కావాలి

23-08-2025 10:51:58 PM

ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రులు లక్ష్మణ్, సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ఆగస్టు 25, 26 తేదీలలో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లు జనహిత పాదయాత్ర వర్ధన్నపేట నియోజకవర్గంలో చేపట్టిన క్రమంలో శనివారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ వ్యవహారాల ఇంచార్జ్, రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, పంచాయత్రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) లు పాల్గొన్నారు.

అనంతరం  మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ... రాహుల్ గాంధీ ఆలోచన మేరకు నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో కి ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ఫలాలు అందరికీ వివరించే విధంగా ప్రణాళికలు రూపొందించామని అన్నారు. వర్ధన్నపేట శాసన సభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేతృత్వంలో పాదయాత్ర జరుగుతుందని మంత్రి అన్నారు.

వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని జనహిత పాదయాత్ర ఆగస్టు 25, 26 న ఆయా జిల్లాల అధ్యక్షులు వారి నేతృత్వంలో పాదయాత్రని విజయవంతం చేసేలా సన్నద్ధం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. గడిచిన 20 నెలల్లో భారతదేశంలోనే ఏ ప్రభుత్వం చేపట్టలేని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు సవివరంగా ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ చేపడుతున్న కార్యక్రమాలు, ఆలోచన విధానాలను ప్రజల వివరించే దిశగా సాగాలని ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు పాదయాత్ర దోహదపడుతుందని వివరించారు.

కాంగ్రెస్ అధికారంలో వచ్చాక అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని ఇకపై అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతం, కార్యకర్తలు అభివృద్ధి, పదవులు విషయంలో మరింత చురుకుగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరుశాతం విజయం సాధించి తీరుతామని ఆశాభావం వ్యక్తంచేశారు. వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో ఉమ్మడి జిల్లా నేతలు ఐకమత్యంతో సమన్వయంగా పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. సమావేశానికి ముందు శుక్రవారం పరమపదించిన వామపక్ష  సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి కి మౌనం వహిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.