25-07-2025 11:41:25 PM
మున్సిపల్ కమిషనర్ రాజలింగు
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని రైల్వే స్టేషన్ వెళ్లే రోడ్డు వర్షానికి రోడ్డు కుంగి పోకుండా రక్షణ చర్యలు చేపట్టారు. పట్టణంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైల్వే స్టేషన్ రోడ్డు పక్కన ఉన్న కాలువలు ఉప్పొంగి ప్రవహించి కాలువ నీరు రోడ్డుపైకి చేరడం నీటి ప్రవాహ వేగానికి రోడ్డు పక్కన మట్టి కొట్టుకు కొట్టుకుపోయి రోడ్డు కుంగిపోవడాన్ని గమనించిన స్థానికులు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.
స్పందించిన కమిషనర్ తుంగపిండి రాజాలింగు శుక్రవారం రైల్వే స్టేషన్ రోడ్డును పరిశీలించి రోడ్డు కింద మట్టి కొట్టుకు పోకుండా ఇసుకను సంచులలో నింపి రక్షణ చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా సమస్య తీవ్రతను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టిన కమిషనర్ తుంగపిండి రాజాలింగుకు స్థానికులు, పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం సుమతి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.