calender_icon.png 26 July, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

26-07-2025 12:00:00 AM

ఇందిరా మహిళా శక్తి,రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం...

గద్వాల, జూలై 25 ( విజయక్రాంతి ).: మహిళల సంక్షేమమే రా ష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని గద్వా ల్ శాసన సభ్యులు బండ్ల కృష్ణ మో హన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ధ రూర్ మండల కేంద్రంలో జిల్లా గ్రా మీణ అభివృద్ధి ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఇందిరా మహిళా శక్తి, రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక,సామాజిక, సాధికారతకే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగావడ్డీ లేని రుణాల పంపిణీ జరుగుతుందని చెప్పారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత అందిస్తోందని అన్నారు.మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రమాద భీమా,రుణ భీమా కల్పనతో పాటుమహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలోఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పాఠశాల నిర్వహణ, క్యాం టీన్లు,పెట్రోల్ బంకుల నిర్వహణ, స్కూల్ యూనిఫామ్ల తయారీ,వరి ధాన్యం కొనుగోలు కేం ద్రాల నిర్వహణ పనులు మహిళలకే అప్పగిస్తూ,వారికి ఉపాధిని కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు.

ధరూర్ మండలంలో 632 మహిళా సంఘాల్లో 7000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని,ఇంకా అనేక మంది మహిళలు సంఘాల్లో సభ్యులుగా చేరాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ మండలానికి 800 మంది అరులైన వారికి మంజూరు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులు త్వరగా పనులను ప్రారంభించి నిర్మాణం చేసుకోవాలని అన్నారు.

అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రూ.4.70 కోట్ల బ్యాంకు రుణాల చెక్కు,రూ. 49.41 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కు,నాలుగురు మహిళా సభ్యురాలు మరణిస్తే వారి కుటుంబానికి బీమా చెక్కులను, లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ తో కలిసి శాసనసభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి స్వామి కుమార్,మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల హనుమంతు,మహిళా సంఘాల సభ్యులు,మహిళలు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.